Erragondapalem: వెలిగొండ టన్నెల్ ప్రమాదంపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆరా!
Erragondapalem: వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్-2 లో జరిగిన ప్రమాదంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
Erragondapalem: వెలిగొండ టన్నెల్ ప్రమాదంపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆరా!
Erragondapalem: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–2లో జరిగిన ప్రమాదంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చరవాణి ద్వారా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
టన్నెల్‌లో హైడ్రాలిక్ యంత్రం తగిలి ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోంటీలాల్ మృతి చెందడంపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రాజెక్టు సీఈతో పాటు మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మృతుడి కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులను, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు.వెలిగొండ ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉన్న సమయంలో ఇటువంటి ప్రమాదం జరగడం ఎంతో విచారకరమని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.
టన్నెల్ పనుల్లో కార్మికుల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు, ఏజెన్సీ ప్రతినిధులకు స్పష్టం చేశారు.




