Addanki: టిడ్కో గృహాల మౌలిక వసతులకు రూ.9.70 కోట్లు: మంత్రి గొట్టిపాటి!
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి శింగరకొండ వద్ద నిర్మిస్తున్న టిడ్కో గృహాల్లో రూ.9.70 కోట్లతో మౌలిక వసతుల పనులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు.
Addanki: టిడ్కో గృహాల మౌలిక వసతులకు రూ.9.70 కోట్లు: మంత్రి గొట్టిపాటి!
అద్దంకి: మున్సిపాలిటీ పరిధిలోని ,శింగరకొండ వద్ద నిర్మిస్తున్న టిడ్కో గృహాలకు మౌలిక వసతుల కల్పన పనులకు రూ.9.70 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు కరెంట్ సరఫరా మౌలిక వసతుల పనులను చేపట్టి గృహాలను పూర్తి స్థాయిలో డిసెంబర్ నెల నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు.
గత వైసిపి ప్రభుత్వ హయాంలో టిడ్కో గృహాల నిర్మాణాలు నిర్లక్ష్యానికి గురై నిలిచిపోయాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పనులను పునఃప్రారంభించామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. అర్హులైన పేదలకు త్వరితగతిన గృహాలను అందించడమే లక్ష్యంగా మౌలిక వసతుల పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.




