Prakasam: ప్రాసంగలపాడులో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి!
Prakasam: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం ప్రాసంగలపాడులో రూ.1.77 కోట్లతో PHC సహా పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.
Prakasam: ప్రాసంగలపాడులో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి!
Prakasam: కొరిశపాడు మండలం ప్రాసంగలపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం లో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.
గ్రామంలో 1.77 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.40 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు.33.70 లక్షల రూపాయలతో చేపట్టిన జల జీవన్ మిషన్ పనులను సైతం మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు.
ఇంటింటికీ సురక్షిత తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ పథకం ద్వారా ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. గ్రామం లో30 లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి మెరుగుపరచడంతోపాటు మెరుగైన వైద్యం సురక్షిత త్రాగునీరు గ్రామ వీధులు సౌకర్యాలు అందించడంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా పాటుపడుతుందని మంత్రి తెలిపారు.




