Addanki: విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు.. టెన్త్ టాపర్‌కు సత్కారం
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు.
Addanki: విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు.. టెన్త్ టాపర్‌కు సత్కారం
Addanki: మండలంలోని వెంపరాల డొంక నామ్ హైవే కి దగ్గర శాంతినగర్ నుంచి ఏలేశ్వరవారిపాలెంకు రూ .5.10 కోట్లతో నిర్మించిన బీటీరోడ్డు (తారు రోడ్డు) శిలాఫలకాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అద్దంకి మండలంలోని ఉప్పలపాడు, మైలవరం, వెంపరాల గ్రామలలో రూ 1.15 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీరోడ్లను మంత్రి ప్రారంభించారు. 23 మంది ఉప్పలపాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ,32 మంది వెంపరాల ప్రభుత్వ పాఠశాల లోని విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు.
వెంపరాల ప్రభుత్వ పాఠశాలలో దాతల సాయంతో నిర్మించిన స్మారక కళావేదికను మంత్రి ప్రారంభించారు. అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో591 అత్యధిక మార్కులు సాధించిన ఝాన్సీ నాగ వెంకట సాయిశ్రీ ని శాలువాతో మంత్రి గొట్టిపాటి సత్కరించారు. మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పాఠాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది అని చెప్పారు మంత్రి లోకేశ్ చొరవతోనే రాష్ట్రస్థాయిలో రాణించిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి గుర్తింపుకు దక్కింది అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడా కూడా రాజకీయ రంగులు, గుర్తులు లేకుండా విద్యార్థులకు షూ,బెల్ట్, యూనిఫార్మ్ లను కూటమి ప్రభుత్వం అందిస్తోంది అని చెప్పారు.




