Peddaraveedu: పెద్దారవీడు మండలంలో భారీ చోరీ

Peddaraveedu: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఎస్.కొత్తపల్లి గ్రామంలో ఇమ్మడి వెంకటేశ్వర్లు ఇంట్లో భారీ చోరీ జరిగింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 11 July 2026 12:28 PM IST
Peddaraveedu
X

Peddaraveedu: పెద్దారవీడు మండలంలో భారీ చోరీ

పెద్దారవీడు: పెద్దారవీడు మండలం ఎస్.కొత్తపల్లి గ్రామంలో చోరీ ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఇమ్మడి వెంకటేశ్వర్లు నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు ఇంటి వెనుక తలుపును పగులగొట్టి లోపలికి ప్రవేశించి సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు నగలను అపహరించారు.

చోరీ జరిగిన విషయం గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై సైదుబాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనను పరిశీలించారు. అనంతరం క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. వేలిముద్రలు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై సైదుబాబు తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story