Marripudi: అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపులను తనిఖీ చేసిన ఫుడ్ కమిషనర్
Marripudi: మర్రిపూడి మండలంలో ఏపీ ఫుడ్ కమిషనర్ చింత ప్రతాపరెడ్డి పర్యటించి అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపులను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.
Marripudi: అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపులను తనిఖీ చేసిన ఫుడ్ కమిషనర్
మర్రిపూడి: మండలంలోని గార్లపేట, వేమవరం, కూచిపూడి గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చింత ప్రతాపరెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గార్లపేటలోని అంగన్వాడీ కేంద్రాలను స్వయంగా సందర్శించి, కేంద్రాల్లోని రికార్డులను పరిశీలించారు.
అనంతరం వేమవరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్ అక్కడ 24 మంది పిల్లలు ఉండటంపై సంతోషం వ్యక్తం చేశారు. అయితే కేంద్రంలో గ్యాస్ స్టాండ్ లేకపోవడాన్ని గమనించి, అంగన్వాడీ కార్యకర్తకు రూ.2,000 నగదు బహుమతి అందజేశారు. ఆ నగదుతో గ్యాస్ స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే మరింత మంది పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి, కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు.
అనంతరం కూచిపూడి గ్రామంలోని రేషన్ షాపును సందర్శించిన ఫుడ్ కమిషనర్ రికార్డులను పరిశీలించి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో డీసీడీఓ హేమలత, డిప్యూటీ డీఈఓ రంగయ్య, ఐసీడీఎస్ పీడీ ఏ. పద్మ సునంద, ఐసీడీఎస్ సీడీపీఓ సుశీల దేవితో పాటు పలు శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




