Markapuram: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గడువు సెప్టెంబర్ 10 వరకు పొడిగింపు
Markapuram: మార్కాపురం జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గడువు సెప్టెంబర్ 10 వరకు పొడిగించబడింది.
Markapuram: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గడువు సెప్టెంబర్ 10 వరకు పొడిగింపు
మార్కాపురం: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (SIR)కు సంబంధించి క్లెయిమ్స్, అభ్యంతరాల దాఖలు గడువును సెప్టెంబర్ 10, 2026 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ సునీత తెలిపారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం నోటీసుల జారీ, క్లెయిమ్స్ మరియు అభ్యంతరాల పరిష్కారం అక్టోబర్ 5 వరకు కొనసాగనుంది. తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 9, 2026న ప్రచురించనున్నారు.
గడువు పొడిగించిన నేపథ్యంలో బూత్ స్థాయి అధికారులు (BLOలు) ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్ల వివరాలను సేకరించాలని కలెక్టర్ సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు నమోదు చేసి, పరిశీలన, పరిష్కార ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని ఆమెన్ఆదేశించారు.
అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో తమ వివరాలను పరిశీలించుకొని, అవసరమైతే క్లెయిమ్స్ లేదా అభ్యంతరాలు దాఖలు చేసుకోవాలని కలెక్టర్ విజయ సునీత కోరారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, స్థానిక ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.




