Markapuram: మార్కాపురంలో స్కూల్ బస్సుల తనిఖీ

Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్‌వీకేపీ కళాశాల ప్రాంగణంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్‌నెస్ తనిఖీ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 8 July 2026 1:05 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో స్కూల్ బస్సుల తనిఖీ

Markapuram: మార్కాపురం పట్టణంలోని ఎస్‌వీకేపీ కళాశాల ప్రాంగణంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలను టౌన్ సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు మాధవరావు, కేఎల్ రావు, గ్రామీణ ఎస్సై వేమన , ట్రాఫిక్ ఎస్ఐ అహరోన్ పాల్గొన్నారు.

బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, బ్రేకులు, టైర్లు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తదితర భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. అనంతరం బస్సు డ్రైవర్లు, యాజమాన్యాలకు విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాలని, లోపాలు ఉన్న బస్సులను వెంటనే సరిచేయాలని సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story