Markapuram: మార్కాపురం పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం..

Markapuram: మార్కాపురంలో రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం. ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్, వాట్సాప్ బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించిన చీఫ్ మేనేజర్ దేవకీ వేణు ప్రసాద్.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 7 July 2026 1:39 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం..

మార్కాపురం: మార్కాపురం పెన్షనర్స్ భవన్‌లో సోమవారం రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ నెలసరి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎస్‌బీఐ మార్కాపురం శాఖ చీఫ్ మేనేజర్ దేవకీ వేణు ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అధ్యక్షులు డాక్టర్ బాల సుబ్బారావు మాట్లాడుతూ, మార్కాపురం పెన్షనర్లందరికీ కంప్రహెన్సివ్ పెన్షన్ ప్లాన్ వర్తింపజేయాలని కోరారు. దీనిపై స్పందించిన వేణు ప్రసాద్, బ్యాంకు తరఫున అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ ఖాతాలు, వాట్సాప్ సేవల ద్వారా అందుబాటులో ఉన్న బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించారు.

అనంతరం చీఫ్ మేనేజర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రామిరెడ్డి, పి. చెంచయ్య, బాలాశంకర్, జయపాల్, డేవిడ్ స్టోన్, నాగేశ్వరావు, డేవిడ్ రాజు, హాసన్ బాష తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story