Markapuram: గంజాయి సమాచారం ఇస్తే మార్కాపురం పోలీసుల బంపర్ ఆఫర్!
Markapuram: మార్కాపురం పట్టణంలో గంజాయి నిర్మూలనకు పోలీసులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
Markapuram: గంజాయి సమాచారం ఇస్తే మార్కాపురం పోలీసుల బంపర్ ఆఫర్!
Markapuram: మార్కాపురం పట్టణంలో గంజాయి నిర్మూలనకు పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. గంజాయి విక్రయాలు, రవాణా, నిల్వలపై సమాచారం అందించే వారికి రూ.10 వేల నగదు బహుమానం అందజేస్తామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్ ప్రకటించారు.
ప్రజల సహకారం లేకుండా మాదకద్రవ్యాల నియంత్రణ సాధ్యం కాదని, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు.పట్టణంలో గంజాయి మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు, గంజాయి విక్రయాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.“సమాచారం మీది… చర్య మాది” అంటూ ప్రచార రథంతో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.మార్కాపురంలో గంజాయి నిర్మూలన కోసం ఈ బంపర్ ఆఫర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్చార్జ్ ఎస్సై అహరోన్, గ్రామీణ ఎస్సై వేమన, టిడిపి సీనియర్ నాయకుడు గుంటక సుబ్బారెడ్డి మరియు పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.




