Markapuram: పెద్దదోర్నాలలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్!
Markapuram: ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో ముఠాగా ఏర్పడి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Markapuram: పెద్దదోర్నాలలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్!
Markapuram: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాలలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ పెద్దదోర్నాల పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
2018 సంవత్సరం నుంచి బెట్టింగ్ యాప్‌ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో బయటపడిందన్నారు. ఒక జట్టుపై మరో జట్టు గెలుపోటములపై బెట్టింగ్ నిర్వహిస్తూ, వెయ్యి రూపాయలకు రూ.50 కమిషన్ తీసుకుని పైకం చెల్లిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.
నిందితుల బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇతర ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఎర్రగొండపాలెం సబ్‌డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అజయ్ కుమార్ హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్దదోర్నాల ఎస్సై వెంకటరమణయ్య పాల్గొన్నారు.




