Markapuram: నివేదిత సొసైటీ ఆధ్వర్యంలో నోట్‌బుక్స్ పంపిణీ

Markapuram: మార్కాపురం పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య కాలనీలో నివేదిత రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 16 Jun 2026 2:41 PM IST
Markapuram
X

Markapuram: నివేదిత సొసైటీ ఆధ్వర్యంలో నోట్‌బుక్స్ పంపిణీ

Markapuram: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య కాలనీలో నివేదిత రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 110 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, అట్టలు, పెన్నులు మరియు పరీక్షా సామగ్రిని ఉచితంగా అందజేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత కొంతమంది విద్యార్థులకు స్వయంగా విద్యా సామగ్రిని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడే ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నివేదిత రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సెక్రటరీ బి. కళావతి చేపడుతున్న సేవా కార్యక్రమాలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి.శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story