Markapuram: మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పెన్షన్ల పంపిణీ!

Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 5వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 July 2026 11:11 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పెన్షన్ల పంపిణీ!

Markapuram: మార్కాపురం పట్టణంలోని 5వ వార్డులో మంగళవారం నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే సామాజిక పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు.

గతంలో రూ.3,000గా ఉన్న సామాజిక పెన్షన్‌ను రూ.4,000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రతి నెల ఒకటో తేదీని పేదల కుటుంబాల్లో పండుగ రోజుగా మార్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

అర్హులైన వారికి త్వరలోనే కొత్త సామాజిక పెన్షన్లు కూడా మంజూరు కానున్నాయని, ఒక్క అర్హుడూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, వార్డు ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story