Markapuram: మార్కాపురం ఎస్వీకేపీ కాలేజీలో ఘనంగా యోగా దినోత్సవం
Markapuram: మార్కాపురం ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Markapuram: మార్కాపురం ఎస్వీకేపీ కాలేజీలో ఘనంగా యోగా దినోత్సవం
మార్కాపురం జిల్లా: కేంద్రంలోని ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ, యోగా మానవ జీవితంలో భాగం కావాలని, మానవ జీవిత శైలిని మార్చే శక్తి యోగాకు మాత్రమే ఉందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు, ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రతిరోజూ యోగా చేయాలని సూచించారు. శరీరం, మనసు, ఆత్మను సమన్వయం చేసేది యోగానేనని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రతిరోజూ కనీసం గంటసేపు యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యోగాను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
జిల్లాలో గత 14 రోజులుగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాల ద్వారా ప్రజల్లో యోగా పట్ల విస్తృత అవగాహన కల్పించామని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు ప్రదర్శించారు.
అనంతరం యోగాలో ప్రతిభ కనబరిచిన వారికి కలెక్టర్, ఎమ్మెల్యేలు బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, తహసీల్దార్ చిరంజీవి తదితర అధికారులు పాల్గొన్నారు.




