Markapuram: మార్కాపురంలో డాక్టర్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసన
Markapuram: మార్కాపురంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు.
Markapuram: మార్కాపురంలో డాక్టర్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసన
Markapuram: మార్కాపురం పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలో విద్యార్థులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలిపిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీల అరెస్టు, వారిపై కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తూ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ, నీట్ ప్రశ్నపత్రం లీకేజీతో దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత విద్యార్థులు, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు అండగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఎంపీలు, విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు.




