Markapuram: నూతన పెన్షన్ల దరఖాస్తులపై కలెక్టర్ విజయ సునీత సమీక్ష!

Markapuram: మార్కాపురం జిల్లాలో నూతన పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 9 Sept 2026 5:13 PM IST
Markapuram
X

Markapuram: నూతన పెన్షన్ల దరఖాస్తులపై కలెక్టర్ విజయ సునీత సమీక్ష!

మార్కాపురం: మార్కాపురం కలెక్టరేట్‌లో నూతన పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు తో కలిసి, కలెక్టర్ విజయ సునీత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణలో ఆయా శాఖలు పాటించాల్సిన విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, డీఆర్‌డీఏ పీడీ శివ నారాయణ, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story