Markapuram: రాయవరంలో కలెక్టర్ విజయ సునీత ఆకస్మిక తనిఖీలు

Markapuram: మార్కాపురం జిల్లా రాయవరం గ్రామపంచాయతీ పరిధిలో సాగుతున్న 'జి-రామ్-జి' పనులను జిల్లా కలెక్టర్ విజయ సునీత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 9 July 2026 1:12 PM IST
Markapuram
X

Markapuram: రాయవరంలో కలెక్టర్ విజయ సునీత ఆకస్మిక తనిఖీలు

Markapuram: మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామపంచాయతీ పరిధిలో చేపడుతున్న జి-రామ్-జి పనులను జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు జరుగుతున్న తీరును పరిశీలించిన ఆమె, అక్కడ పనిచేస్తున్న కూలీలతో నేరుగా మాట్లాడి వారికి సకాలంలో వేతనాలు అందుతున్నాయా, పని ప్రదేశంలో తాగునీరు, నీడ, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారా అనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పనుల్లో నాణ్యతతో పాటు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

ఈ తనిఖీలో డీఆర్‌డీఏ పీడీ శ్రీమతి సువార్త, ఏపీడీ నిర్మలాదేవి, ఎంపీడీవో ఏ. బాలచెన్నయ్య, ఏపీవో నాగరాజు, గ్రామ నాయకులు కాకర్ల శ్రీను, జి-రామ్-జి సిబ్బంది పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story