Markapuram: కలెక్టర్ విజయ సునీతకు అభినందనల వెల్లువ: బీజేపీ ఘన సత్కారం!
Markapuram: వెలుగొండ ప్రాజెక్టు, నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో సమర్థవంతంగా పనిచేస్తున్న మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతను బీజేపీ నేతలు సత్కరించారు.
Markapuram: కలెక్టర్ విజయ సునీతకు అభినందనల వెల్లువ: బీజేపీ ఘన సత్కారం!
మార్కాపురం జిల్లా: నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు తొలి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి, జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో సమర్థవంతంగా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ సునీతను బీజేపీ జిల్లా నాయకులు ఘనంగా అభినందించారు.
స్టేట్ బీజేపీ మహిళా మోర్చా సెక్రటరీ, మార్కాపురం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి (BLA-1) శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మంగళవారం కలెక్టర్ విజయ సునీతను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు ‘అభినందన పత్రం’ అందజేసి ఘనంగా సత్కరించారు.
ఇటీవల ఆగస్టు 31న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా చారిత్రాత్మక పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కలెక్టర్ కీలకంగా వ్యవహరించారని బీజేపీ నాయకులు ప్రశంసించారు. అలాగే వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారం, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం, గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి వచ్చే సమస్యలను అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించడంలో కలెక్టర్ చూపుతున్న చొరవను అభినందించారు.
భావోద్వేగాలతో కూడిన సున్నితమైన సమస్యలను సైతం సమయస్ఫూర్తితో, మెలకువతో పరిష్కరిస్తూ జిల్లా పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్ విజయ సునీత పనితీరు అభినందనీయమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బెల్లంకొండ విజయలక్ష్మి మాట్లాడుతూ.. “కలెక్టర్ విజయ సునీత ఇదే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ నూతన మార్కాపురం జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తారన్న విశ్వాసం జిల్లా ప్రజల్లో ఉంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు పి.వి. కృష్ణారావు, స్టేట్ బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ జె.వి. నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మండ్ల శివప్రసాద్, కనిగిరి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి నరాల శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల లక్ష్మి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజా శ్రీకాంత్, జిల్లా బీజేపీ మహిళా నాయకులు కోణా లక్ష్మి, అరుణ భాయి, పట్టణ ప్రధాన కార్యదర్శి గొల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.




