Markapuram: మార్కాపురంలో అటవీ భూముల పరిరక్షణకు ప్రత్యేక 'బ్లూప్రింట్'!

Markapuram: మార్కాపురం జిల్లాలో అటవీ భూముల పరిరక్షణపై కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రత్యేక సమావేశం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 28 April 2026 10:23 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో అటవీ భూముల పరిరక్షణకు ప్రత్యేక 'బ్లూప్రింట్'!

Markapuram: నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో అటవీ భూములను పరిరక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా అటవీ రక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో 42 శాతం అటవీ భూమి కింద ఉందన్నారు. అడవి భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత అటవీశాఖ, రెవిన్యూ సిబ్బందిపై ఉందన్నారు. ప్రభుత్వ భూములను ల్యాండ్ బ్యాంకులుగా గుర్తించి ప్రాజెక్టులకు ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అటవీ, రెవిన్యూ శాఖల మధ్యలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. వచ్చే సమావేశం నాటికి 1500 ఎకరాలను ల్యాండ్ బ్యాంక్ గా గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఒంగోలు డి ఎఫ్ ఓ వినోద్ కుమార్, మార్కాపురం, గిద్దలూరు డిడిపిటిలు అబ్దుల్ రవుఫ్, నిషా కుమారి, మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు ప్రభాకర్ శివరామిరెడ్డి, అటవీశాఖ సిబ్బంది అన్ని మండలాల తహసిల్దార్లు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story