Markapuram: మార్కాపురంలో మెగా గ్రీవెన్స్.. కలెక్టర్, ఎమ్మెల్యే హాజరు

Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన ప్రత్యేక మెగా గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎమ్మెల్యే కందుల పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 16 May 2026 5:26 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో మెగా గ్రీవెన్స్.. కలెక్టర్, ఎమ్మెల్యే హాజరు

Markapuram: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని శుభం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక మెగా గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించగా మొత్తం 121 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రత్యేక మెగా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని వరుసగా నాలుగు శుక్రవారాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎజెండాగా తీసుకుని ప్రతి అర్జీని నాలుగు శుక్రవారాల్లో పరిష్కరించేలా చర్యలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇంకా అర్జీలు సమర్పించని ప్రజలు వచ్చే శుక్రవారాల్లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాలకు హాజరై తమ సమస్యలను తెలియజేయాలని ఎమ్మెల్యే కందుల కోరారు.మార్కాపురంనియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను నేరుగా విన్నారని తెలిపారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, అర్జీదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story