Markapuram: మార్కాపురంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ!
Markapuram: మార్కాపురం మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ ఘనంగా జరిగింది.
Markapuram: మార్కాపురంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ!
మార్కాపురం జిల్లా: మార్కాపురం మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మార్కాపురం జిల్లాలో గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై వివరించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో సాధించిన అభివృద్ధి ఫలితాలను ప్రజలకు వివరించడమే ఈ విజయోత్సవ సభ ముఖ్య ఉద్దేశ్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు.




