Pullalacheruvu: మార్కాపురంలో 10 అడుగుల కొండచిలువ కలకలం.. భయంతో పరుగులు
Pullalacheruvu: మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం కొండారెడ్డి కోస్టాల్‌లో ఇంట్లోకి చొరబడిన 10 అడుగుల కొండచిలువ. కోడిని మింగిన సర్పం, చాకచక్యంగా బంధించిన స్నేక్ క్యాచర్.
Pullalacheruvu: మార్కాపురంలో 10 అడుగుల కొండచిలువ కలకలం.. భయంతో పరుగులు
పుల్లలచెరువు: పుల్లలచెరువు మండలం కొండారెడ్డి కోస్టాల్‌లో 10 అడుగుల కొండచిలువ కలకలం రేపింది. ఓ ఇంట్లోకి చొరబడిన కొండచిలువ కోడిని మింగింది.
ఇంట్లో భారీ కొండచిలువను చూసిన కుటుంబ సభ్యులు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మల్లికార్జున అక్కడికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను బంధించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story




