Markapur: మార్కాపురం తహసీల్దార్ తీరుపై అన్నా రాంబాబు విమర్శలు
Markapur: మార్కాపురం తహసీల్దార్ వ్యవహారశైలిపై వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు తీవ్ర విమర్శలు. భ్రమరా వెంచర్ అక్రమాలపై సమగ్ర విచారణకు డిమాండ్.
Markapur: మార్కాపురం తహసీల్దార్ తీరుపై అన్నా రాంబాబు విమర్శలు
మార్కాపూర్: మార్కాపురం జిల్లా మార్కాపురం మండల తహసీల్దార్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ అన్నా రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. భ్రమరా వెంచర్‌లో ఎలాంటి అవినీతి జరగలేదంటూ తహసీల్దార్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
గత రికార్డులు (RSR) తెప్పించి పరిశీలిస్తే చెరువు అసలు విస్తీర్ణం ఎంత, ప్రస్తుతం ఎంత మేర ఆక్రమణకు గురైందో నిరూపిస్తామని అన్నారు. రాజకీయ ఒత్తిళ్లకో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో అధికారులు ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదని విమర్శించారు.
అలాగే చెరువుపై రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించిన అన్నా రాంబాబు, ఆ సమయంలో అధికారులకు అక్రమాలు కనిపించలేదా అని నిలదీశారు.
మరోవైపు తహసీల్దార్‌పై పలు ఆరోపణలు ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గతంలోఒంగోలులో కలెక్టరేట్ ఉండేదని, ఇప్పుడు మార్కాపురం జిల్లాలోనే కలెక్టరేట్ ఏర్పాటు చేసినా ప్రజలకు ఉపయోగం లేకపోతే దాని వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమైతే సంబంధిత అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నా రాంబాబు డిమాండ్ చేశారు.




