Yerragondapalem: ఎర్రగొండపాలెంలో ఘనంగా 'నిజం గెలిచింది' కార్యక్రమం

Yerragondapalem: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో చంద్రబాబు జైలు నిర్బంధానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ.

Srikanth Singam, Markapur
Published on: 9 Sept 2026 10:49 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: ఎర్రగొండపాలెంలో ఘనంగా 'నిజం గెలిచింది' కార్యక్రమం

ఎర్రగొండపాలెం: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు గురై రాజమండ్రి కేంద్ర కారాగారంలో 53 రోజులపాటు నిర్బంధంలో ఉన్న ఘటనకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 53 కొవ్వొత్తులను వెలిగించి చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు అరెస్టు సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని, ప్రజా మద్దతుతో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు పేర్కొన్నారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలిపారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, యూనిట్ ఇన్‌చార్జిలు, బూత్ ఇన్‌చార్జిలు, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడికి మద్దతుగా తమ ఇళ్లలో కూడా కొవ్వొత్తులు వెలిగించి కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story