Markapur: వెలిగొండ నిర్వాసితుల ఆందోళన - ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి
Markapur: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించాలని, గెజిట్ జాబితా విడుదల చేయాలని కోరుతూ మార్కాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
Markapur: వెలిగొండ నిర్వాసితుల ఆందోళన - ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి
మార్కాపూర్: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో గజెట్‌లో నమోదు కాని అర్హుల కుటుంబాల జాబితాను వెంటనే ప్రకటించి, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మార్కాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం మార్కాపురం జిల్లా కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య మాట్లాడుతూ.. గజెట్‌లో మిస్ అయిన కుటుంబాల జాబితాను ప్రకటిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ఇచ్చిన హామీ అమలు కాలేదని అన్నారు. 2019–26 మధ్య 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరికీ ఎలాంటి మినహాయింపులు లేకుండా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిర్వాసితులందరికీ వెంటనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులుకు అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, నిర్వాసితులు పాల్గొన్నారు.




