Markapur: హాస్టళ్లలో రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ

Markapur: మార్కాపురంలోని ఎస్సీ, బీసీ హాస్టళ్లలో రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేసి, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 7 Sept 2026 8:16 PM IST
Markapur
X

Markapur: హాస్టళ్లలో రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ

మార్కాపూర్: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్సీ బాలికల, బీసీ బాలుర హాస్టళ్లలో రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న భోజనం, ఆహార పదార్థాల నాణ్యత, వంటశాల పరిశుభ్రత, ఆహార నిల్వలు, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యత, ఎదురవుతున్న సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని సిబ్బందిని ఆదేశించారు. ఆహార నాణ్యతలో ఏమాత్రం తేడా వచ్చినా బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, ఎస్సీ హాస్టల్ ఈడీ నాయక్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story