Markapur: ఎస్సై విశ్వనాథరెడ్డి మారువేషంలో వెళ్లి పేకాట రాయుళ్ల అరెస్ట్

Markapur: మార్కాపురం పట్టణ శివారులో మారువేషంలో వెళ్లిన ఎస్సై విశ్వనాథరెడ్డి పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 13 May 2026 7:47 PM IST
Markapur
X

Markapur: ఎస్సై విశ్వనాథరెడ్డి మారువేషంలో వెళ్లి పేకాట రాయుళ్ల అరెస్ట్

Markapur: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి చాకచక్యంగా మారువేషంలో ఘటన స్థలానికి చేరుకుని ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి రూ.14 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కాపురం మండలంలో అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి హెచ్చరించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story