Markapur: పెద్ద దోర్నాల హైస్కూల్ సమీపంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

Markapur: పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీప దుకాణాల్లో ఎస్ఐ వెంకటరమణయ్య ఆధ్వర్యంలో తనిఖీలు. నిషేధిత వస్తువులు విక్రయిస్తే కఠిన చర్యలు.

Srikanth Singam, Markapur
Published on: 26 July 2026 7:11 AM IST
Markapur
X

Markapur: పెద్ద దోర్నాల హైస్కూల్ సమీపంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

మార్కాపూర్: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని దుకాణాల్లో ఎస్ఐ వెంకటరమణయ్య ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్యానికి హానికరమైన గుట్కా, పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాలు లేదా ఇతర నిషేధిత వస్తువులను విక్రయిస్తే సంబంధిత దుకాణ యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటరమణయ్య హెచ్చరించారు.

పాఠశాలల పరిసరాల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story