Markapur: మార్కాపురం కలెక్టరేట్‌లో గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
Markapur: మార్కాపురం కలెక్టరేట్‌లో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఆర్డీఓ, ఇన్‌చార్జి డీఆర్‌ఓ శివరామిరెడ్డి పిలుపు.
Markapur: మార్కాపురం కలెక్టరేట్‌లో గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
మార్కాపూర్: సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాలను కొనసాగిస్తూ ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని మార్కాపురం ఆర్డీఓ, ఇన్‌చార్జి డీఆర్‌ఓ శివరామిరెడ్డి పిలుపునిచ్చారు.
లచ్చన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం లచ్చన్న చేసిన సేవలను కొనియాడారు.
అనంతరం గౌడ సంఘం నాయకులు ఆర్డీఓను ఘనంగా సన్మానించారు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు, గౌడ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఆర్డీఓకు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు కీర్తి సాయన్న, కంచర్ల కేశవయ్య, వేములకొండ శ్రీనివాసులు, గజ్జ రంగనాయకులు, మాదాసు రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




