Markapur: మార్కాపురం జిల్లాలో ఈ నెల 12న మెగా జాబ్ మేళా

Markapur: మార్కాపురం జిల్లా కనిగిరిలో ఈ నెల 12న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించిన కలెక్టర్ ఎం. విజయ సునీత. పోస్టర్ ఆవిష్కరణ.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 5 Aug 2026 8:25 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం జిల్లాలో ఈ నెల 12న మెగా జాబ్ మేళా

మార్కాపూర్: మార్కాపురం జిల్లాలోనీ​​ రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఇందులో భాగంగా ఈ నెల 12వ తేదీన కనిగిరి పట్టణంలోని జి.సి.వై.పి.ఎన్ డిగ్రీ కళాశాలలో ‘మెగా జాబ్ మేళా’ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు.

బుధవారం మార్కాపురం కలెక్టరేట్ ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ప్రచార పోస్టర్‌ను జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.

​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రసిద్ధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన యువత పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి (DSDO) ఎం. కంచిబాబు, జిల్లా ప్లేస్‌మెంట్ అధికారి నదన్ బాబు, ఇతర నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story