Markapur: మార్కాపురం జిల్లాలో యథేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమ రవాణా

Markapur: మార్కాపురం, యర్రగొండపాలెం ప్రాంతాల్లో రేషన్ బియ్యం బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని ప్రజల ఆందోళన. బాధ్యులపై ఈసీ చట్టం కింద కేసులు పెట్టాలని డిమాండ్.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 5 Aug 2026 4:00 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం జిల్లాలో యథేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమ రవాణా

మార్కాపూర్: మార్కాపురం జిల్లా వ్యాప్తంగా అక్రమంగా రేషన్ బియ్యం కొనుగోలు, నిల్వ, తరలింపు జరుగుతోందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి నెల 5వ తేదీ నాటికి పెద్దఎత్తున రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నా సంబంధిత అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

మార్కాపురం, యర్రగొండపాలెం ప్రాంతాల్లో రేషన్ మాఫియా యథేచ్ఛగా వ్యవహరిస్తోందని, అక్రమంగా బియ్యం సేకరణ, రవాణాపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బాధ్యులపై ఈసీ చట్టం (Essential Commodities Act) ప్రకారం కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

గమనిక: పై ఆరోపణలు స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నవే. వీటిపై సంబంధిత అధికారుల స్పందన, అధికారిక విచారణ అనంతరం వాస్తవాలు వెల్లడికావాల్సి ఉంది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story