Markapur: మార్కాపురం కలెక్టరేట్ వద్ద భారీ పోలీసు బందోబస్తు
Markapur: మార్కాపురం కలెక్టరేట్‌కు మంత్రుల రాక నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం తరలివచ్చిన వెలిగొండ ముంపు గ్రామాల ప్రజలు.
Markapur: మార్కాపురం కలెక్టరేట్ వద్ద భారీ పోలీసు బందోబస్తు
మార్కాపురం: మార్కాపురం కలెక్టరేట్‌కు మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ రానున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.
మంత్రులకు తమ సమస్యలు, వినతులు తెలియజేసేందుకు వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్‌కు తరలివచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముంపు గ్రామాల ప్రజలు కలెక్టరేట్‌లోకి ప్రవేశించకుండా ఇరువైపులా భారీ కేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తమకు రావాల్సిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, పరిహారం నిధులపై మంత్రులకు వినతులు అందించేందుకు నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు.
Next Story




