Markapur: వెలిగొండ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, నిత్యావసరాలు పంపిణీ

Markapur: వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసిత సుంకేసుల గ్రామ ప్రజలకు కలెక్టర్ ఎం. విజయ సునీత ఇళ్ల పట్టాలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

MADARVALI, MARKAPURAM
Published on: 8 Sept 2026 7:59 PM IST
Markapur
X

Markapur: వెలిగొండ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, నిత్యావసరాలు పంపిణీ

మార్కాపూర్: వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తమ సర్వస్వాన్ని, ఇళ్లను, పొలాలను మరియు ఊర్లను త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పేర్కొన్నారు.

మార్కాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో గోగులదిన్నె లేఔట్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించబడిన వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసిత సుంకేసుల గ్రామ ప్రజలకు ఇళ్ల పట్టాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించి, నిర్వాసితులకు పట్టాలు మరియు సహాయ సామగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడాతు

నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను వేగంగా తీసుకురావడం కోసం 11 గ్రామాల ప్రజలు తమ సర్వస్వాన్ని త్యాగం చేసి వేర్వేరు ప్రాంతాలకు తరలివెళ్లారని, వారిని ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్వాసిత కుటుంబాలకు అదనపు సహాయం అందించడానికి ప్రత్యేక జీవోను జారీ చేయడం జరిగిందన్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీ 25 కేజీల నాణ్యమైన బియ్యం

2 కేజీల వంటనూనె, చక్కెర, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు తదితర నిత్యావసర వస్తువులు మహిళలకు చీర, గాజులు, పసుపు, కుంకుమ పశు పోషణ కోసం దాణా పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సుమారు 26 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నిర్వాసితులకు అవసరమైన పునరావాస ప్రాంతాలలో తాగునీరు, విద్యుత్ వంటి అన్ని రకాల ప్రాథమిక మౌలిక సదుపాయాలను వేగంగా పూర్తి చేయడానికి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

పండగ వాతావరణంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో సుంకేసుల గ్రామ ప్రజలందరికీ భోజన వసతితో పాటు సమగ్ర ఏర్పాట్లు చేశామని, పట్టాల పంపిణీ పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, సుంకేసుల గ్రామ నిర్వాసిత ప్రజలు పాల్గొన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM

Next Story