Markapur: మార్కాపురం ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద బ్యాంకు ఉద్యోగుల ఆందోళన

Markapur: మార్కాపురం ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 27 Aug 2026 10:42 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద బ్యాంకు ఉద్యోగుల ఆందోళన

మార్కాపూర్: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ ఆధ్వర్యంలో మార్కాపురం ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద బ్యాంకు ఉద్యోగులు నిరసన చేపట్టారు.

ఉద్యోగులపై పెరుగుతున్న పని భారం, ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం వెంటనే 5 రోజుల పనిదినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకు ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఇంకా వారానికి ఆరు రోజులు పని చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పని ఆధారిత ప్రోత్సాహకాల విషయంలో ఉన్న వ్యత్యాసాలను కూడా సరిచేయాలని కోరారు. ఈ నిరసనలో ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు, యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story