Markapur: ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి - సీఐ అల్తాఫ్ హుస్సేన్

Markapur: మార్కాపురం కృష్ణ చైతన్య కళాశాలలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని సీఐ అల్తాఫ్ సూచించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 10 Sept 2026 4:41 PM IST
Markapur
X

Markapur: ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి - సీఐ అల్తాఫ్ హుస్సేన్

మార్కాపూర్: ర్యాగింగ్‌కు పూర్తిగా దూరంగా ఉండి, స్నేహపూర్వక వాతావరణంలో విద్యార్థులు విద్యను కొనసాగించాలని మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్ సూచించారు. మార్కాపురంలోని కృష్ణ చైతన్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌లోని డా. ఏ.పి.జే. అబ్దుల్ కలాం సెమినార్ హాల్‌లో గురువారం యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. ర్యాగింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్‌తో పాటు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. తోటి విద్యార్థులను గౌరవిస్తూ, సీనియర్లు–జూనియర్లు సోదరభావంతో మెలగాలని సూచించారు. కళాశాల ప్రాంగణంలో ప్రతి విద్యార్థికి భద్రత, గౌరవం కల్పించడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు.

“గౌరవం చూపుదాం... స్నేహాన్ని పెంచుదాం... ర్యాగింగ్‌ను నిర్మూలిద్దాం” అనే సందేశంతో విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా. ఏ. రంగనాయకులు, హెచ్‌&ఎస్ విభాగాధిపతి, ఫస్ట్ ఇయర్ ఇన్‌చార్జ్, అధ్యాపకులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story