Markapur: భూముల ఆక్రమణలపై విచారణ కోరిన అన్నా రాంబాబు

Markapur: మార్కాపురం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణ జరపాలని జేసీ పులి శ్రీనివాసులకు వినతిపత్రం అందజేసిన అన్నా రాంబాబు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 27 July 2026 6:24 PM IST
Markapur
X

Markapur: భూముల ఆక్రమణలపై విచారణ కోరిన అన్నా రాంబాబు

మార్కాపూర్: మార్కాపురం జిల్లా మార్కాపురం రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ, దేవాదాయ, నీటిపారుదల శాఖ భూములు, చెరువులు, వాగులు, బఫర్ జోన్‌లలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అక్రమ ఆక్రమణలు, తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా భ్రమర వెంచర్స్ సమీపంలో చెరువును పూడ్చి రోడ్డు నిర్మాణం చేపట్టిన అంశంపై విచారణ జరిపి అక్రమాలను తొలగించాలని కోరారు. అలాగే కాలేజీ రోడ్డులో మున్సిపల్ అధికారులు వేసిన మార్కులపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని జాయింట్ కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి షంషీర్ అలీ బేగ్ , ఏఎంసీ మాజీ చైర్మన్ గోలమారి శ్రీనివాసరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సలీం , తర్లుపాడు వైసిపి పార్టీ అధ్యక్షులు మురారి వెంకటేశ్వర్లు, రాష్ట్ర మైనార్టీ నాయకులు మొహముదిన్, మాజీ కౌన్సిలర్ మంగమూరి శ్రీనివాసులు, బట్టగిరి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story