Markapuram: మండల కన్వీనర్‌గా మండ్ల బాల కాశయ్య.. అభినందించిన జిల్లా అధ్యక్షుడు

Markapuram: ప్రకాశం జిల్లా దోర్నాల మండల బీజేపీ కన్వీనర్‌గా మండ్ల బాల కాశయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 April 2026 12:33 PM IST
Markapuram
X

Markapuram: మండల కన్వీనర్‌గా మండ్ల బాల కాశయ్య.. అభినందించిన జిల్లా అధ్యక్షుడు

మార్కాపురం జిల్లా: దోర్నాల మండల బిజెపి పార్టీ కన్వీనర్ గా మండ్ల బాల కాశయ్యని నియమిస్తూ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ సంఘం శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు..! దీనికి సంబంధించి నియామక పత్రాన్ని మండ్ల బాల కాశయ్య కి అందజేశారు..!

గతంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చాలో వివిధ బాధ్యత నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాలలో అనునిత్యం చురుకుగా ఉంటూ పార్టీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీలో పని చేస్తూ ఉన్నందుకు తనను గుర్తించి మండల పార్టీ కన్వీనర్గా నియమించినందుకు బిజెపి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అదేవిధంగా పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రానున్న రోజుల్లో దోర్నాల మండలంలో పార్టీ నాయకుల అందరి సహకారంతో భారతీయ జనతా పార్టీని మరింత పనిచేసేలా పార్టీలో మరిన్ని కార్యక్రమాలు దోర్నాల మండలంలో జరిగేలా తన వంతు కృషి చేసి పార్టీ అభివృద్ధికి తోడ్పడతానని పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story