Prakasam: 30 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
Prakasam: పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 30 మంది విభిన్న ప్రతిభావంతులకు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.
Prakasam: 30 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
ప్రకాశం: ఎర్రగొండపాలెంలో విభిన్న ప్రతిభావంతులకు చేయూతనందించాలి – జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత విభిన్న ప్రతిభావంతులకు ప్రతి ఒక్కరూ చేయూతనందించి వారికి అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పేర్కొన్నారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని బీసీ కాలనీలో పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మానవతా దృక్పథంతో పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాజంలో విభిన్న ప్రతిభావంతులను ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
ప్రతి ఒక్కరూ వారికి ఏదో ఒక రూపంలో సహాయం అందిస్తే వారు మరింత ఆత్మవిశ్వాసంతో, ఆశాభావంతో ముందుకు సాగుతారని సూచించారు. సమాజంలో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మొత్తం 30 మంది విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి ప్రవీణ్ కుమార్, సంస్థ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.




