Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌లో డీఆర్ఓకు ఘన స్వాగతం

Markapuram: మార్కాపురం జిల్లా నూతన జిల్లా రెవెన్యూ అధికారిగా (DRO) ఎం. వెంకట శివరామిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 6 May 2026 3:24 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌లో డీఆర్ఓకు ఘన స్వాగతం

Markapuram: మార్కాపురం జిల్లా నూతన డీఆర్ఓ (FAC)గా ఎం. వెంకట శివరామిరెడ్డి బుధవారం కలెక్టరేట్‌లో ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.

ఇప్పటివరకు ఆయన కంభం ఎస్‌డీసీగా, కనిగిరి ఇన్‌చార్జి ఆర్డీవోగా విధులు నిర్వహిస్తూ పరిపాలనలో తన ప్రత్యేక ముద్ర వేశారు. పరిపాలనా అనుభవం, సేవాభావంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఓ రవీంద్రారెడ్డి, తహసిల్దార్ చిరంజీవి, డిప్యూటీ ఎమ్మార్వో శ్రీనివాసులు, డిపిఆర్ఓ మోహన్‌రావు తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story