Giddalur: గిద్దలూరు ఫారెస్ట్‌లో చిరుతపులి: అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట రిజర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 15 Sept 2026 9:35 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు ఫారెస్ట్‌లో చిరుతపులి: అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు!

గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు, మండలంలోని, దిగువమెట్ట, ప్రతాప్‌రెడ్డి కాలనీ, పెద్దచెరువు, జయరాపురం, జయరాపురం తండా, ఎల్లుపల్లి, ఉప్పలపాడు మరియు అంబవరం గ్రామాల పరిసర ప్రాంతాల సమీపంలో గల రిజర్వు ఫారెస్ట్ నందు చిరుతపులి సంచరిస్తున్నట్లు గుర్తించబడింది.

ఈ ప్రాంతాల ప్రజలు, రైతులు, పశువుల మరియు గొర్ల కాపలదారులు రిజర్వు ఫారెస్ట్ లో ప్రవేశించకుండా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. దీనిఫై సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించటం జరిగినది.

ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం మరియు రాత్రి వేళల్లో ఒంటరిగా సంచరించకుండా జాగ్రత్తలు పాటించాలి. చిరుతపులి కనిపించినప్పుడు దాని దగ్గరకు వెళ్లడం, వెంబడించడం, గుంపులుగా చేరడం లేదా ఫోటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నించడం చేయకూడదు.

చిరుతపులి కనిపించినా లేదా దాని ఆనవాళ్లు గుర్తించినా వెంటనే సమీప అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలి. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖ సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU