Podili: పొదిలిలో ఉత్సాహంగా సాగిన 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం!

Podili: ప్రకాశం జిల్లా పొదిలిలో ఉత్సాహంగా సాగిన 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన నాయకులు.

MADARVALI, MARKAPURAM
Published on: 15 Sept 2026 7:26 PM IST
Podili
X

Podili: పొదిలిలో ఉత్సాహంగా సాగిన 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం!

Podili: పట్టణంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. పట్టణంలోని 233వ బూత్ పరిధిలోని నీటి ట్యాంక్ ప్రాంతంలో బూత్ కన్వీనర్ షారబు దీపు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు గడపగడపకూ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

ప్రచార కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజలతో మమేకమవుతూ పార్టీ విధానాలను వివరిస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరికుంట్ల అనీల్, పొదిలి పట్టణ అధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్, 4వ వార్డు కన్వీనర్ అల్లాహ్, ఐటీడీపీ ప్రెసిడెంట్ గిద్దలూరి శ్రీకాంత్, నాయకులు బొడ్డు సుబ్బయ్య, వీరిశెట్టి సురేష్, ముల్లా మాషుక్, ఉస్మాన్, జిందు, మహబూబ్ భాష తదితరులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ యూత్ వింగ్ సభ్యులు, స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM