Markapuram: మార్కాపురం జిల్లాలో పచ్చని తోటల ప్రణాళిక.. అధికారుల తనిఖీలు
Markapuram: యర్రగొండపాలెం మండలం బోయలపల్లి గ్రామంలో VB-GRAMG ఆధ్వర్యంలో పండ్ల తోటల పెంపకం కార్యక్రమం జరిగింది.
Markapuram: మార్కాపురం జిల్లాలో పచ్చని తోటల ప్రణాళిక.. అధికారుల తనిఖీలు
Markapuram: యర్రగొండపాలెం మండలం బోయలపల్లి గ్రామంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ & ఆజీవికా మిషన్ గ్రామీణ్ (VB-GRAMG) పండ్ల తోటల పెంపకం కార్యక్రమంలో భాగంగా రైతు పొలంలో పండ్ల మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, మార్కాపురం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సి.హెచ్. సువార్త, యర్రగొండపాలెం ఏపీఓ పాల్గొని రైతులకు ఉద్యానవన సాగు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు.
కార్యక్రమంలో యర్రగొండపాలెం మండల అధ్యక్షుడు చిట్యాల వెంగల్ రెడ్డి, బోయలపల్లి సర్పంచ్ పాలడుగు వెంకట కోటయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




