Yerragondapalem: వెలిగొండ ప్రాజెక్ట్‌ను సందర్శించిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే!

Yerragondapalem: ఎర్రగొండపాలెం మండలం పెద్ద దోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్ట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. కృష్ణా జలాలకు హారతి, ప్రత్యేక పూజలు.

Srikanth Singam, Markapur
Published on: 13 Sept 2026 5:01 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: వెలిగొండ ప్రాజెక్ట్‌ను సందర్శించిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే!

Yerragondapalem: పెద్ద దోర్నాల మండలం కొత్తూరు వద్ద ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్‌ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదివారం సందర్శించారు. సుమారు 500 మంది క్యాడర్‌తో కలిసి ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న ఆమెకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు.

అనంతరం ఫీడర్ కెనాల్ వద్దకు వెళ్లిన గల్లా మాధవి.. కృష్ణా జలాలకు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్ట్ ప్రాధాన్యత, ప్రాజెక్ట్ ద్వారా అందనున్న ప్రయోజనాలపై వివరాలను తెలుసుకున్నారు.

వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి జాతికి అంకితం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని గల్లా మాధవి అన్నారు. ప్రాజెక్ట్‌కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని సందర్శించినట్లు ఆమె తెలిపారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur