Markapuram: పెద్దబొమ్మలాపురంలో చెరువు పనులకు ఎరిక్షన్ బాబు శంకుస్థాపన!
Markapuram: పెద్దదోర్నాల పెద్దబొమ్మలాపురంలో రూ.4.72 కోట్లతో గండి వీరభద్ర స్వామి చెరువు అభివృద్ధి పనులకు టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు.
Markapuram: పెద్దబొమ్మలాపురంలో చెరువు పనులకు ఎరిక్షన్ బాబు శంకుస్థాపన!
Markapuram: పెద్దదోర్నాల మండలంలోని పెద్దబొమ్మలాపురం గ్రామంలో గండి వీరభద్ర స్వామి చెరువు అభివృద్ధికి మరో ముందడుగు పడింది. రూ.4.72 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా చెరువు అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సాగునీటి వనరుల అభివృద్ధితో రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ కృష్ణారెడ్డి, డీఈ, ఏఈ, దోర్నాల మండల అధ్యక్షుడు షేక్ మాబు, మండల సీనియర్ నాయకులు, పెద్దబొమ్మలాపురం గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




