Markapur: మార్కాపురంలో హనుమాన్ శోభాయాత్ర సంబరాలు

Markapur: మార్కాపురం పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 12 May 2026 7:57 PM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో హనుమాన్ శోభాయాత్ర సంబరాలు

Markapur: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి సందర్భంగా నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర భక్తి శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.

ఈరోజు మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో గల శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శోభాయాత్రను ప్రారంభించారు.

అనంతరం శోభాయాత్ర ఆర్టీసీ బస్టాండ్, కంభం బస్టాండ్, గడియార స్తంభం సెంటర్, అమ్మవారి శాల మీదుగా దోర్నాల బస్టాండ్ వరకు ఘనంగా సాగింది. జై హనుమాన్ నామస్మరణలతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ మార్మోగాయి.

ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి భావంతో శోభాయాత్రలో నడిచారు. జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్, టీడీపీ పోల్ మేనేజ్‌మెంట్ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి, బీజేపీ నాయకులు కృష్ణారావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మరియు హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story