Gottipadiya: వెలిగొండ ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ విజయ సునీత

Gottipadiya: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామం గొట్టిపడియను జిల్లా కలెక్టర్ విజయ సునీత పరిశీలించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 4 Sept 2026 5:14 PM IST
Gottipadiya
X

Gottipadiya: వెలిగొండ ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ విజయ సునీత

గొట్టిపడియ: వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన గొట్టిపడియ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత పరిశీలించారు. ముంపు పరిస్థితులు, నీటిమట్టం పెరుగుదలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ముంపు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నీటిమట్టం పెరుగుదలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

ముంపు పరిస్థితుల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ విజయ సునీత స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story