Giddalur: స్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలి: గిద్దలూరు సీఐ!

Giddalur: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'హర్ ఘర్ తిరంగా' సైకిల్ ర్యాలీ. స్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సిఐ సురేష్ పిలుపు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 13 Aug 2026 4:33 PM IST
Giddalur
X

Giddalur: స్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలి: గిద్దలూరు సీఐ!

గిద్దలూరు: స్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడాలని మార్కాపురం జిల్లా గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ విద్యార్థులకు సూచించారు. ఆగస్టు 15న 80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ప్రధాన కూడళ్ల గుండా పోలీస్ స్టేషన్ నుండి రాచర్ల గేట్ సెంటర్ వరకు సీఐ సురేష్ విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ప్రదర్శిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణాల త్యాగపలమే మనకు ఈ స్వాతంత్ర్యం లభించిందని విద్యార్థులకు సీఐ తెలిపారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని సమాజానికి ఉపయోగపడాలని అలానే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సిఐ సురేష్ విద్యార్థులకు ఉపదేశించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story