Giddalur: గిద్దలూరులో ఘనంగా మాజీ సైనికుల సంఘం స్వాతంత్ర వేడుకలు

Giddalur: గిద్దలూరు మాజీ సైనికుల సంఘం కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 15 Aug 2026 6:09 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరులో ఘనంగా మాజీ సైనికుల సంఘం స్వాతంత్ర వేడుకలు

గిద్దలూరు: గిద్దలూరు మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి దేశభక్తిని చాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి స్వాతంత్ర్య సమరయోధులు, సైనికుల త్యాగాలను కొనియాడారు. భారత దేశంలో ఇవాళ జాతీయ జెండా రెప రెప లాడుతుందంటే దానికి కారణం మన సైనికులేనని ఆయన అన్నారు.

ఎముకలు కొరికే చలిలో,మండుటెండలో సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ దేశరక్షణలో అశువులు బాసిన సైనికులకు నా జోహార్లు తెలిపారు.

ఈ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటిగా దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మాజీ సైనికులు, సైనిక వితంతువులు, సైనిక కుటుంబాలు ,ప్రజలు, నాయకులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story