Giddalur: గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి మెడికల్ అసోసియేషన్ వినతి

Giddalur: ఈనెల 20వ తేదీన జరగనున్న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్‌కు మద్దతుగా గిద్దలూరు మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 18 May 2026 5:17 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి మెడికల్ అసోసియేషన్ వినతి

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరులో దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన నిర్వహించనున్న మెడికల్ షాపుల బంద్‌కు మద్దతుగా స్థానిక మెడికల్ దుకాణ యజమానులు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మెడికల్ రంగంలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని కోరారు. ఔషధ వ్యాపారులకు ఇబ్బందులు కలిగించే విధానాలను సవరించి, వ్యాపార రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ది గిద్దలూరు మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు తుమ్మలపెంట వెంకటసుబ్బయ్య, సెక్రటరీ బచ్చు చంద్రశేఖర్,ట్రెజరీ తుమ్మలపెంట సురేషు సభ్యులు , ఫార్మసిస్టులు మరియు వ్యాపార సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story