Giddalur: గిద్దలూరు హాస్టళ్లలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు!
Giddalur: గిద్దలూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ, బీసీ వసతి గృహాల్లో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Giddalur: గిద్దలూరు హాస్టళ్లలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు!
గిద్దలూరు: పట్టణంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా పలు సాంఘిక సంక్షేమ, బీసీ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ పోస్ట్‌మెట్రిక్ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఆయనను విద్యార్థులు కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
విద్యార్థుల సమస్యలను విన్న విజయ ప్రతాపరెడ్డి వాటిపై ఆరా తీశారు. అనంతరం రాచర్ల రోడ్డు పోస్ట్‌మెట్రిక్ బీసీ బాలుర వసతి గృహానికి వెళ్లగా అక్కడ వార్డెన్, సరిగా విద్యార్థులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. కంభం బాలికల ఉన్నత పాఠశాలలో తనిఖీలు చేసి పిల్లలకు అందించే గుడ్లు బియ్యం సంచులు అదనంగా ఉండటంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story




